World / Health
మ్యాజిక్ టచ్ ఉంది.. ఏడవకు కన్నా..
623 days ago

అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులను ఏడుపు ఆపించే కొత్త టెక్నిక్ ఇది.. వాళ్ళను ఎలా ఊరడించాలో తెలియక తలలు పట్టుకునే తలిదండ్రులకు ఎంతో ఊరటనిచ్చే పద్ధతి ఇది. ఈ మ్యాజిక్ టెక్నిక్‌ను అమెరికాలోని పీడియాట్రీషియన్ రాబర్ట్ హామిల్టన్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

నాలుగునిమిషాల ఈ వీడియో యూ-ట్యూబ్‌లో హిట్ అయి కేవలం నాలుగురోెజుల్లో 17లక్షలమంది చూసి ముక్కున వేలేసుకున్నారట. అతి సులభమైన ఈ టెక్నిక్‌లో నాలుగు దశలున్నాయి. ఫస్ట్ స్టేజ్‌లో.. చిన్నారిని జాగ్రత్తగా ఛాతీని కుడిచేతితోనూ, నడుము కింది భాగాన్నిఎడమ చేతితోనూ 40 డిగ్రీల కోణంలో పట్టుకోవాలట. ఆ తర్వాత రెండో దశలో మెల్లగా అటూఇటూ 45 డిగ్రీల కోణంలో చిన్నారిని ఊపాలని, మూడో దశలో ఎడమచేతిని పిరుదుల భాగంలో పట్టుకుని కేవలం నాలుగునిమిషాలు ఊపుతూ పోతే వారు చటుక్కున ఏడుపు ఆపేస్తారని రాబర్ట్ అంటున్నాడు.

ఇలా పేరెంట్స్‌కు కాసేపు శిక్షణ కూడా ఇచ్చాడు. మొదట్లో తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడినా.. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి తమ బిడ్డల ఏడుపును ఆపించగలిగారు. ఐతే ఇది జస్ట్.. ఆకలితో ఉన్న.. మూడునెలల వయస్సు ఉన్న చిన్నారులకే పనిచేస్తుందని రాబర్ట్ సెలవిస్తున్నాడు.

 
 
Related News