India / General
జల్లికట్టుబాట్లెందుకు?
220 days ago

తమిళనాడులో ప్రముఖులంతా జల్లికట్టు క్రీడపై తమ అభిప్రాయాలు చెబుతున్న వేళ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ అంశంపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు. జల్లికట్టును తాను ఓ సాంప్రదాయ క్రీడగానే చూస్తానని, తమిళనాడులో జరిగే ఈ సాంప్రదాయ క్రీడ వల్ల ఎవరికీ సమస్య ఉంటుందని తాను భావించడం లేదన్నారు.

మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో జల్లికట్టు వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించిన వెంకయ్య, జల్లికట్టుకు అడ్డంకిగా ఉన్న చట్టాన్ని సవరించాలని ఇప్పటికే పలు విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు. ఈ విషయంలో సలహాలు సూచనలు తీసుకుంటున్నామని, కోర్టులు ఏం ఆలోచిస్తున్నాయన్నది కూడా తెలియాల్సి ఉందన్నారు. అయితే, జనవరి 14లోపు ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయం తనకు తెలీదన్నారు. 

 
 
Related News