AP and TS / Entertainment
నో లిక్కర్. ఓన్లీ ఫ్రూట్ జ్యూస్
06:59 PM on 22nd October, 2014

‘గోవిందుడు అందరివాడేలే’లో ఓ మందు సీన్ గురించి హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా చూడగానే చాలామందికి కాజల్ మందు  తాగుతుందా అని అనుకున్నారు. ఈ విషయంలో పబ్బులకు వెళ్లినా తానెప్పుడూ మద్యం తీసుకోలేదని గుర్తు చేసింది. ఈ సినిమా గురించి డైరెక్టర్ కృష్ణవంశీ స్టోరీ వినిపించినప్పుడే మందు తీసుకునే సన్నివేశం ఉంటుందని చెప్పారని వెల్లడించింది. 

 

 

మొదట తాను అంగీకరించకపోయినా ఈ రోజుల్లో చాలామంది గాళ్స్ పబ్‌లకు వెళ్లడం, అక్కడ మద్యం సేవించడం సర్వ సాధారణమేనని చెప్పి దర్శకుడు కన్విన్స్‌ చేయడంతో నటించాల్సివచ్చిందని తెలిపింది. తాను ఎప్పుడు పబ్స్‌కి వెళ్ళినా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటానని అంటోంది. ప్రస్తుతానికి ప్రేక్షకులు తన గురించి తలోరకంగా మాట్లాడుకోకుండా కాజల్ ముందుగానే జాగ్రత్త పడిందని ఇండస్ర్టీలో అనుకుంటున్నారు. 

 
 
 
Related News