India / Crime
నలుగురు అరెస్ట్.. 'ఒకరు' ఎస్కేప్ !
112 days ago

నడిరోడ్డులో అమ్మాయిపై లైంగికదాడిచేస్తుంటే చోద్యంచూశారు. ఈ ఘోరం బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకుని ఒంటరిగా ఇంటికివెళ్తోన్న ఓ అమ్మాయిని స్కూటర్ మీద వచ్చిన ఇద్దరు యువకులు అడ్డగించారు. ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు.

అయితే, ఈ దారుణాన్ని కొందరు రోడ్డుమీద నుంచి చూసినప్పటికీ కొందరు తమకెందుకులేనని పోతే, మిగతాకొందరు చోద్యం చూశారు. ఈ ఘాతుకం అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డవడంతో బయటకొచ్చింది. ఇదే ఆ వీడియో ఫుటేజ్..  డిసెంబర్ 31వతేదీ అర్థరాత్రి ఎమ్ జీ రోడ్డులో కామాంధులు అమ్మాయిలపై లైంగికదాడి ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా బెంగళూరులోని ఈ కామాంధుల గురించి సెర్చ్ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాము అమ్మాయిల‌ను వేధించిన‌ట్లు వాళ్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితులు ఓకే.. ఈ వ్యవహారంపై కామెంట్స్ చేసిన రాజకీయ నేత మాటేంటి? అంటూ  సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 

 

 
 
 
Related News

JournalistDiary