India / Politics
ఎన్టీఆర్‌ బాటలో తమిళహీరో
220 days ago

తెలుగునాట అన్నగా ఖ్యాతిగాంచిన నందమూరి తారకరామారావు బాటలో పయనిస్తున్నట్టున్నారు తమిళ హీరో..డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌. సినీరంగానికి గుడ్ బై చెప్పి, పొలిటికల్ అరంగేట్రం చేసిన ఎన్టీఆర్, అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే స్నానాలు, భోజనాలు చేస్తూ జనం దృష్టిని ఆకర్షించడమేకాదు, ప్రజల నమ్మకాన్ని పొందగలిగారు.

ఆ క్రమంలో సరికొత్త చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తర్వాతికాలంలో ఎన్టీఆర్ చాలామంది సినీరంగ ప్రముఖులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇక విజయ్ కాంత్ విషయానికొస్తే, తమిళనాట హీరోగా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ విజయకాంత్ అనుకున్నంతగా రాణించలేకపోయారు. ప్రజలతో మమేకం కాలేరని కామెంట్స్ కూడా ఎదుర్కొన్న విజయ్ కాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ బాటలో పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఓ పల్లెటూరులో కారుఆపి తలపాగా కట్టుకుని, నిల్చునే భోజనం చేసి ఆశ్చర్యపరిచాడు. 

 
 
Related News