World / Health
ఇలా బతికేస్తున్నారట
201 days ago

కాకిలా కలకాలం బతికే కంటే.. హంసలా ఆరునెలలు బతికేచాలు అనే సామెత వినే ఉంటారుగా! ఇప్పుడా సామెత ఎందుకంటారా? భూమ్మీద మనిషి మనుగడ సాగించేకాలం పెరిగిపోయింది. పర్యావరణ కాలుష్యంతో వస్తున్న కొత్త కొత్త వ్యాధుల బారినపడి జీవఛ్ఛవాల్లా బతికేస్తున్నారంటున్నాయి తాజా పరిశోధనలు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో జరిపిన శోధనలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయ. లైఫ్ లైన్ కంటే ఎక్కువకాలం బతకాలనే కోరిక పెరిగిపోయిందని లాన్‌సెట్ జర్నల్ స్టడీ పేర్కొంది. దాని ప్రకారం మనుషులు ఎక్కువకాలం బతుకుతున్నా అనేక రోగాలు, జబ్బులు వాళ్లను వెంటాడుతున్నాయట. ఎక్కువకాలం బతికున్న వారిలో శ్వాసకోస సంబంధిత వ్యాధులు, గుండెజబ్బులు, వెన్నునొప్పులు, రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు లాంటి సమస్యలతో కునారిల్లు తున్నారని స్టడీ తేల్చిచెప్పింది.

పదిహేనేళ్లలో జీవితకాలం ఆరేళ్ళు పెరిగిందనీ, 2013 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ నివేదిక ప్రకారం జీవితకాలం జపాన్‌లో అధికం(73.4 సంవత్సరాలు)కాగా, లెసోతో‌లో అయితే అతి తక్కువగా(42 సంవత్సరాలు)  తేల్చింది. చాలా మంది అంటువ్యాధులు కాని జబ్బులతో ఎక్కువకాలం బతుకుతున్నా, వీటివల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గిందంటున్నారు. మరో విషయం ఏంటంటే...ఈ స్టడీస్ ప్రాంతాల్లో 1990-2015 మధ్యకాలంలో రకరకాల జబ్బుల వల్ల మరణాల బారినపడ్డ సంఖ్య 249 మంది. ఇక వ్యాధులు, గాయాలతో చనిపోయినవారు 315 మంది. రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల 79 మరణాలకు సంబంధించి195  దేశాల నుంచి సమాచారం సేకరించింది. దీనిప్రకారం పదిలో ఏడు మరణాలు హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్, కిడ్నీ సంబంధిత వ్యాధులు,హెచ్‌ఐ‌వి, మలేరియా వంటి వ్యాధులు వల్ల సంభవిస్తున్నాయిని తేలింది. అలాగే ఈ మరణాల సంఖ్య 1990ల్లో 48 మిలియన్లుంటే.. 2015 నాటికి  56 మిలియన్లకు పెరిగింది. సో.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం, చదువులాంటి వ్యవహారాల్లో ముందున్నా, ఆరోగ్యంలో మాత్రం పెద్ద దేశాలు సైతం అనారోగ్యంగానే ఉన్నాయన్న విషయం స్టడీస్ ద్వారా తేలింది. 

 

 

 

 
 
 
Related News

JournalistDiary