India / General
ఆహారం కోసం.. సైనికుడి గోడు
256 days ago

పేదవాళ్లకే కాదు చివరకు సరిహద్దుల్లో పనిచేసే సైనికులకూ సరైన ఆహారం అందక నానాఇబ్బందులు పడుతున్నారు. ఆ ఉదంతాన్ని కళ్లకు కట్టినట్టు వీడియో రూపంలో చూపించాడు జమ్మూకాశ్మీర్‌ బీఎస్‌ఎఫ్‌లోని 29వ బెటాలియన్‌కి చెందిన తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ అనే జవాన్. దేశంలో అవినీతి పెరగడంతో తమకి సరైన ఆహారం దొరకడంలేదని, ఈ నేపథ్యంలో బాధ్యతలు నిర్వహించడం కఠినంగా మారిందని చెప్పుకొచ్చాడు. జవాన్లకు కల్పించాల్సిన సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. సైన్యానికి వెచ్చించిన నిధులను పైఅధికారులు మింగేస్తున్నారని ఆరోపించారు. రొటి ముక్కలు, నీళ్లు, టీ తాగుతున్నామని పదిగంటలు డ్యూటీ చేసి రాత్రికి పసుపు, ఉప్పు కలిపిన సూప్‌ తాగుతూ జీవిస్తున్నామంటూ బాధలను వర్ణించాడు. 

దేశమంతటా ఎంతో గర్వంగా చెప్పుకునే జవాన్లు అనుభవిస్తున్న క్షోభ గురించి అందరికీ తెలియాలనే వీడియో తీసినట్టు వెల్లడించాడు. తాము పడుతున్న కష్టాలను అధిష్ఠానం గుర్తించేవరకు వీడియో రూపంలో పోస్ట్‌ చేస్తుంటానని స్పష్టంచేశాడు బహదూర్‌. యాదవ్ వీడియోలు వైరల్ కావడంతో తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని యాదవ్ వ్యక్తంచేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

 
 
 
Related News
JournalistDiary