India / Politics
మోదీకేమయింది?
291 days ago

శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దనోట్లు రద్దుతో..  రెండురోజులపాటు దేశమంతా భయంతో కంపించిపోయింది. జనం చిల్లరకోసం రోడ్లమీదకు వచ్చేశారు. నల్లధనం, దొంగనోట్లు, తీవ్రవాద నియంత్రణ కోసం డిమోనిటైజేషన్ నవంబర్ 8న ప్రకటన చేసిన మోదీ మళ్ళీ 53 రోజుల తర్వాత టీవీల్లో ప్రత్యక్షమై 42 నిమిషాల సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. ఈ ఉపన్యాసంలో ఎక్కడా వివరణలు లేవు. మామూలుగా బడ్జెట్ ప్రసంగంలో దొర్లించే రెండు మూడు వరాలు దొర్లాయి తప్ప.. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఎంత నల్లధనం బయటకు వచ్చిందోనన్న వివరాలు లేవు. తనదైన నాన్ స్టాప్ ధోరణిలో ఆయన ప్రసంగం సాగిపోయింది. 

మోదీ కొత్తగా ఏం బాబులు పేలుస్తారోనంటూ టీవీలకు అతుక్కుపోయి చూసిన వాళ్ళకు బోర్ కొట్టింది. మంచి నిర్ణయాలకోసం ఎదురుచూసిన వాళ్ళకు నిరాశ కలిగించింది. ఆయన ప్రసంగం ఆద్యంతం జవాబుదారీతనం, పారదర్శకతలు లేకుండా సాగిపోవడాన్ని విపక్షాలు విమర్శించాయి. పైగా మోదీ హావభావాల్లో కొట్టొచ్చిన మార్పు కనిపించింది. మునుపటి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం గోచరించలేదు. పెద్దనోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించి దొర్లిన తప్పులు గానే... ప్రజలు ఎదుర్కొన్న కష్టాల గురించిగానీ కనీస ప్రస్తావనలు లేకుండా మోదీ ప్రకటించిన గర్భిణీ స్త్రీలకు.. వయోవృద్ధులకు ప్రకటించిన వరాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మోదీ గత నవంబరు 8న తన మంత్రివర్గ సహచరులను సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా తీసుకున్న  పెద్దనోట్లు రద్దు నిర్ణయం విమర్శలపాలవ్వడంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఆయన మరేదో పెద్ద నిర్ణయం తీసుకుంటారన్న మాటలు వినిపించాయి. ముఖ్యంగా బినామి ఆస్తులను నియంత్రిస్తారంటూ వస్తున్న వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే, అటువంటి ప్రస్తావనే లేకపోవడంతో ఆశ్చర్యపోవడం తమవంతయిందంటూ సొంతపార్టీ వర్గాలయులే పెదవివిరుస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary