World / Health
మగాళ్లకు ముట్టని వ్యవహారం..
360 days ago

మహిళలు జీవిత కాలంలో తప్పించుకోలేని మెనుస్ట్రువల్ సైకిల్ వాళ్లపాలిట శాపంగా  మారింది..  మహిళలే బుతు సంబంధిత సమస్యలతోబాధపడుతున్నారంటే అది పురుషుల సమస్యగా కూడా భావించాల్సి ఉంటుందంటున్నాయి కొన్ని స్వఛ్చంధ సంస్థలు. మహిళల జీవితకాలంలో  ఆరు నుంచి ఏడు సంవత్సరాలకు పైగా  వచ్చే రుతు సంబంధ సమస్యల నుంచి వాళ్లను చైతన్యవంతులను చేసేందుకు నడుం బిగించింది వాటర్ ఎయిడ్ అనే  స్వఛ్చంధ సంస్థ. దీనిలో భాగంగా మే 28న మెనుస్ట్రువల్ హైజీన్ డే‌గా పాటిస్తున్నారు. వయసు వచ్చిన బాలికలు, మహిళలకు ఆరోగ్యవంతమైన, అవసరమైన టాయిలెట్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అవసరమైన నీరు, సోపులు, శానిటరీ నాప్కిన్లు, అందించడంలో నిర్లక్ష్యం వహించరాదంటోంది వాటర్ ఎయిడ్ సంస్థ. మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం అందిచాల్సిన బాధ్యత అందరిపై ఉందనీ, రుతుచక్రంలో వచ్చే  సమస్యలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటోందీ సంస్థ. 

ప్రపంచంలో సుమారు 80 కోట్ల మంది రుతు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల్లో15 నుంచి 49 ఏళ్ల వయసున్నవారు ఉన్నారు. అయితే వీళ్లల్లో సుమారు  వంద కోట్ల మందికి  బుతుస్రావం సమయంలో సరయిన టాయిలెట్లు లేక నానాఇబ్బందులు పడుతున్నారట. ఇక ఆఫ్రికాలో అయితే సౌకర్యాల లేమి కారణంగా  పదిమంది అమ్మాయిల్లో ఒకరు స్కూలుకు అటెండ్ కాలేక పోతున్నారట. కారణం స్కూళ్లలో ఆడపిల్లలకు ప్రత్యేకమైన టాయిలెట్లు లేకపోవడమేనట. ముందుకు పోతున్న ఆధునిక ప్రపంచంలో స్త్రీల మెనుస్ట్రువల్ సమయం వాళ్ల పాలిట శాపంగా మారింది. ఇప్పటికీ చాలాదేశాల్లో  కొంతమంది మహిళలు మెనుస్ట్రువల్ సైకిల్ శాపమేమి కాదంటున్నారు. నేపాల్‌తోపాటు కొన్నిదేశాల్లో ఇప్పటికీ అమల్లోవున్న చౌపడీ అనే ఆచారం  ప్రకారం రుతు సమయంలో మహిళలకు ఇంట్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇంటికి దూరంగా మరేదైనా ఇంటి ఆవరణలో నిద్రించడం, గుళ్లలోకి అనుమతి నిరాకరించడం, నలుగురు వాడే నీటిని వాడకుండా వాళ్లను కట్టడి చేయడం, పండుగలు, మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన‌కుండా నిషేధమున్న స్థితి. అయితే ఈ అరాచక ఆచారంపై సుప్రీంకోర్టు 2005 లోనే అభ్యంతరాలు  వ్యక్తం చేసినా ఇంకా నిరాటంకంగా కొనసాగుతుండటం దురదృష్టకరం. పురుషాధిక్య సమాజంలో రుతు సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయడంలో విశేషమేమీ లేదంటున్నాయి స్వఛ్చంధ సంస్థలు.

 

 
 
 
Related News
JournalistDiary