World / Health
టీవీ ముందు కూచుని తింటే..లావై పోతారు
452 days ago

టీవీ చూస్తూ ఆహారం తింటే లావై పోతారని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అదే పనిగా టీవీ చూస్తూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, ఒబేసిటీ కి దారి తీస్తుందని అంటున్నారు. ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ, వాటిలో లీనమై పోవడం వల్లో, ఫేస్ బుక్ లో బిజీ అయిపోవడం వల్లో తాము ఎంత తింటున్నామనే విషయాన్ని మరచిపోతారట..ఇది హెల్త్ కి ఏమాత్రం మంచిది కాదని సెలవిస్తున్నారు. అమెరికాలో రీసెర్చర్లు సుమారు 60 కుటుంబాలను స్టడీ చేశారు.

టెలివిజన్ల ముందు కూర్చుని ఫుడ్ లాగిస్తున్న వారిని, మామూలుగా డైనింగ్ హాల్లో తింటున్న వారిని అధ్యయనం చేశారు. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ను, ప్రవర్తనను, కమ్యూనికేషన్ ను స్టడీ చేయగా ఈ విషయం బయట పడింది. టీవీల ముందు కూచున్న పేరెంట్స్ తమ పిల్లలు ఎంత తింటున్నారో పర్యవేక్షించ లేకపోయారని తేలింది. వాళ్ళ ఎమోషన్స్ ని, బిహేవియర్ ని కూడా పసిగట్టలేకపోయారట. దీనివల్ల స్థూల కాయం పెరుగుతుంది సుమా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యంగా పేరెంట్స్ తమ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary