India / Crime
బెంగళూరులో మరో కీచకుడు
110 days ago

బెంగళూరులో మరో కీచకుడి బాగోతం బయటపడింది. కేజీహళ్లిలో ఆఫీస్ కు వెళ్తున్న ఓ యువతిని దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికాడు. ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం 6.30 గంటల సమయంలో యువతి బస్‌స్టాప్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బనశంకరిలో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన, స్కూటర్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ యువతిని అర్థరాత్రివేల రోడ్డుకాచి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనలు మరువకముందే ఇప్పుడు మరో దారుణం చోటుచేసుకుంది.

 

 
 
 
Related News

JournalistDiary