World / General
భీకర గాలులకు ఊగిన ఎయిర్‌బస్
9 days ago

భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు భీకరమైన గాలులు రావడం మనం చూస్తాం. బలమైన చెట్లు సైతం క్షణాల్లో కూలి పోతాయి. అలాంటిది విమానాలైతే.. ఏం జరుగుతుందో ఊహించుకోవడం కష్టం. వినడానికే భయంగావుంటే విమానంలో వున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎమిరేట్‌‌కి ఎయిర్‌బస్‌ ఏ380. ఈనెల ఐదున జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న టైమ్‌లో భీకరమైన ఈదురు గాలులకు విమానం ఒక్కసారిగా ఊగిపోయింది. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్‌ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

Read Also

 
Related News
JournalistDiary