World / General
నిఖార్సయిన హార్స్ పవర్..
256 days ago

ఒక్కసారి హిస్టరీ పేజీలు తిరగేస్తే.. రాజుల ఆస్తుల లెక్కలో గుర్రాలు కూడా ఉండేవట. ఒక రాజు యుద్ధంలో గెలవాలంటే రాజు ధైర్యంతో బాటు గుర్రం చూపించిన తెగువ కూడా రాజులకు విజయాలు తెచ్చిపెట్టిన అశ్వాలు కొకొల్లలు. యవనాశ్వం, జవానాశ్వం, మేలుజాతి అశ్వంలాంటి రకరకాల గుర్రాలు పేర్లే కాదు. అసలీ గుర్రాల కథేంటి ? అని కొద్దిగా తోతుకెళ్తే ఆసక్తి కలిగించే ఎన్నో సంగతులు..

అసలు గుర్రాల్లో మేలు జాతి గుర్రం కావాలంటే .  తుర్కిస్థాన్ పోవాల్సిందే. అక్కడ మాత్రమే లభించే బ్రీడ్ ఒకటుంది. దాని పేరు ఆఖల్ ఠీక్  రాజసం ఉట్టిపడే తెల్లనిరంగు..మెరిసిపోయే  ముఖమల్ క్లాత్ లాంటి చర్మం.. వంశ పారపర్యంగా దానిలో వచ్చిన ఆకర్షణ బాణంలా దూసుకుపోయే లక్షణాలకారణంగా ఆఖల్ ఠీక్ జాతి గుర్రానికి నేమ్ అండ్ ఫేం తెచ్చిపెట్టాయి.

ఇక గుర్రాల్లో మరో మేలురకం జాతి గుర్రం మౌవాడ్ పాస్కల్ లేదా స్ట్రాంగ్ లైప్ హార్స్ అంటుంటారు. దీన్నే అథ్లెటిక్ హార్స్ అని కూడా పిలుస్తుంటారు. 

షట్టర్ స్టోక్  లేదా హానెస్టా స్టావ్స్. చాలా జగ్రత్తగా స్మూత్ గా హ్యండిల్  చేయాల్సిన రకం గుర్రం.. ఎక్స్ ట్రీమ్లీ ఇంటెలిజెంట్. హ్యాండిలింగ్ లో ఏమాత్రం మొరటుదనం అనిపించినా బిగుసుకుపోయే జాతి గుర్రం... ఈ జాతిగుర్నాన్ని అరుదైన జాతి గుర్రంగా పిలుస్తారు. మనుగడ సాగిస్తు్న్న గుర్రాల సంఖ్య కూడా తక్కువేనని చెబుతుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ 6,600 గుర్రాలు మాత్రమే ఉన్నాయని చెబుతుంటే మరి కొంతమంది మాత్రం అంతలేదు... ప్రస్తుతానికి 3,500  గుర్రాలే మనుగడ సాగిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆయా గుర్రాల జాతి, పుట్టుక గురించీ కూపీ లాగితే.. కొంత తేడా ఉందంటున్నారు.

ఇక తుర్క్ మెనిస్థాన్ గుర్రాలకు మంచి చరిత్ర ఉంది కాబట్టి... సెలెక్ట్ చేసి మరీ హార్స్ రైడింగ్ కు ఈ జాతి గుర్రాలనే వాడుతున్నారు. అలా లెక్క దీస్తే ఇప్పటికే ఆఖల్ ఠీక్ జాతికి ఘనమైన చరిత్రే ఉందట. బ్లాక్, బ్రౌన్, వైట్ కలర్స్ లో ఆట్రాక్టివ్ గా ఉండే ఈ గుర్రాలకు ఎంత వేడి వాతావరణాన్నయినా తట్టుకుంటాయట. అంతే కాకుండా ఎంతో ఓపిగ్గా ఉండే ఈ జాతి గుర్రాలు ఏకథాటిగా 80 నుంచి 100 మైళ్లు పరిగెత్తగలగడమే కాకుండా  కొద్దిరోజులపాటు నీటి మాటే ఎత్తవట.

 
 
 
Related News
JournalistDiary