World / Health
ఐదున్నర కిలోల 'కిడ్నీ' ఆపరేషన్ సక్సెస్!
9 days ago

ముంబైలో ఉంటున్న మంజూదేవి అనే 28 ఏళ్ల ఆవిడ.. కుడివైపు నడుము కింద భాగంలో పెద్ద బొబ్బ లాంటిది ఏర్పడి.. మూడేళ్ళ నుంచి ఇబ్బంది పడుతోంది. డాక్టర్ల సలహా మేరకు సీటీ స్కాన్ తీస్తే.. అది కిడ్నీలో ఫామ్ అయిన కణితి అంటూ తేల్చేశారు. కాకపోతే దీని మాత్రం అత్యంత అసాధారణంగా తోచింది. 31 సెంటీ మీటర్ల వ్యాసంతో వున్న ఈ కణితి ఆమె డేటుడే లైఫ్ ని కష్టతరం చేసింది.


కానీ.. ఎలా తొలగించాలన్నదే సమస్య. కానీ.. ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ మాత్రం దీన్నొక ఛాలెంజ్ గా తీసుకుంది. యూరాలజిస్ట్ అజిత్ సావంత్ నేతృత్వంలోని ఒక టీమ్ సర్జరీకి తెగించేసింది. ఐదున్నర కిలోలున్న ఈ కణితిని జాగ్రత్తగా కత్తిరించి బైటికి తీయడానికి వీళ్లకు ఎనిమిది గంటలు పట్టింది. ఆపరేషన్ సక్సెస్.. పేషేంట్ సేఫ్! ఒక మూత్రపిండం మహా అయితే 110 నుంచి 140 గ్రాముల దాకా బరువుంటుంది. కానీ.. ఈమె కిడ్నీలోని కణితి.. కిడ్నీ కంటే 50 రెట్లు ఎక్కువ బరువుంది. అందుకే.. 'అతిపెద్ద కిడ్నీ కణితి'గా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కింది.

 

Read Also

 
Related News
JournalistDiary