India / Politics
మోదీ సర్కారుపై మరో బాంబు
9 days ago

మోదీ సర్కారుపై స్వంత పార్టీకి చెందిన సీనియర్ నేతల విమర్శల పరంపర కొనసాగుతోంది. ఆపార్టీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా మోదీ సర్కారు తీరును మరోసారి తప్పుబట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జై షా పై అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్లయిందని యశ్వంత్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి పొరపాట్ల కారణంగా బీజేపీ ఇప్పుడు గిల్టీగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. వ్యాపారవేత్త అయిన జై షా కోసం ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను కోర్టులో దించడాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందంటూ ఇటీవల యశ్వంత్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైషా ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయంటూ ది వైర్‌ అనే వెబ్‌ సంస్థ ప్రచురించిన కథనం సంచలనం రేకెత్తించింది. సదరు సంస్థపై జై రూ.100కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary