India / Politics
కలిసిపోనున్న పళని, పన్నీర్..! దినకరన్ ఔట్!
71 days ago

తమిళనాడులో అధికార అన్నా డీఎంకె పార్టీలోని రెండు వర్గాలూ విలీనం కావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేవారం వెలువడవచ్చు. సీఎం పళనిస్వామి నేతృత్వంలోని వర్గం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఈ దిశగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని రెబెల్ వర్గంతో విలీనమయితే ఎలా ఉంటుందని సమాలోచన జరిపారని, విలీనాన్ని ఖరారు చేసేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ భేటీ కావచ్చునని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విలీన ప్రతిపాదనను ఏఐడీఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెచ్చారని, దీనిపై మరింత లోతుగా చర్చించవచ్చునని అంటున్నారు. అయితే పార్టీ నుంచి శశికళను బహిష్కరించాలని పన్నీర్ సెల్వం వర్గం కోరుతోంది.

 

ఇదిలా ఉండగా.. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా  దినకరన్ నియామకాన్ని పళనిస్వామి ప్రశ్నించారు. ఇది ఇల్లీగల్ అని, ఆఫీస్ బేరర్ల నియామక ప్రకటన పార్టీ రూల్స్ కు విరుద్ధమని  ఆయన అన్నారు.  అటు-పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన వర్గంలోని నేత తిరునావుక్కరసు చెప్పారు.  జనరల్ ఎన్నికలు జరిగేవరకు పార్టీ వ్యవహారాలను పర్య వేక్షించే ఏడుగురు సభ్యులకమిటీ కి పన్నీర్ సెల్వం అధ్యక్షునిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా  దినకరన్ నియామకాన్ని పళనిస్వామి ప్రశ్నించారు. ఇది ఇల్లీగల్ అని, ఆఫీస్ బేరర్ల నియామక ప్రకటన పార్టీ రూల్స్ కు విరుద్ధమని  ఆయన అన్నారు.  అటు-పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన వర్గంలోని నేత తిరునావుక్కరసు చెప్పారు.  జనరల్ ఎన్నికలు జరిగేవరకు పార్టీ వ్యవహారాలను పర్య వేక్షించే ఏడుగురు సభ్యులకమిటీ కి పన్నీర్ సెల్వం అధ్యక్షునిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.

 

Read Also

 
Related News
JournalistDiary