India / Entertainment
అజిత్ ‘సుర్వీవా’ సాంగ్ అదిరింది
124 days ago

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వివేగం చిత్రంలోని మొదటి పాట -సుర్వీవా టీజర్ ని యూనిట్ విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన స్టూడియోలో తానే ఈ పాట పాడడం విశేషం. మరో సింగర్ యోగి కూడా ఈ టీజర్ లో కనిపిస్తాడు. ఇంగ్లీషు, తమిళ పదాలతో సాగే ఈ సాంగ్ ట్యూన్ భలే క్యాచీగా ఉందన్న ప్రశంసలు అప్పుడే మొదలయ్యాయి. శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న వివేగం మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ కాగా, కాజల్ అగర్వాల్, అక్షర హసన్ హీరోయిన్లు. ఈ ఫస్ట్ సాంగ్ టీజర్ కి యూ ట్యూబ్ లో సుమారు 10 లక్షల వ్యూస్ వచ్చాయట. పూర్తి పాటను ఈ నెల 19 న రిలీజ్ చేయనున్నారు.

]

 

Read Also

 
Related News
JournalistDiary