India / Crime
ఆరుషి హత్యకేసులో తుది తీర్పు
8 days ago

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు తన తుది తీర్పు వెల్లడించింది. ఘజియాబాద్ సీబీఐ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చుతూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్‌‌ లను నిర్దోషులుగా తేల్చింది. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు చూపించలేదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో ఆరుషి తల్లిదండ్రులకు ఊరట కలిగినట్లైంది. ఫలితంగా దాస్నా జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఆరుషి తల్లిదండ్రులు జైలు నుంచి విడుదల కానున్నారు.

 

2008 మే 16న నోయిడాలో ఆరుషి, హేమరాజ్‌ల హత్య జరిగింది. నిజానికి ఆరోజు ఆరుషి 16వ బర్త్‌డే... అయితే అదేరోజున తన బెడ్‌రూమ్‌లో ఆమె, టెర్రేస్‌పై పని మనిషి 45 ఏళ్ల హేమరాజ్ మృతదేహాలను కనుగొన్నారు. మొదట హేమరాజ్ ఈ హత్య చేశాడని భావించారు. అయితే అది నిజంకాదని ఆ మరుసటిరోజున హేమరాజ్ మృతదేహాన్ని చూసిన తర్వాత తేలింది.

 

 

Read Also

 
Related News
JournalistDiary