World / Health
మన ఎలర్జీలకు కారణం వాళ్ళేనా..?
583 days ago

ఈ కాలంలో మనుషులకు ఎలర్జీలు వచ్చి బాధ పడుతున్నారంటే ఇందుకు కారణం నాడు నియాండర్ థాల్స్ తో పూర్వీకులు సెక్స్ జరపడమేనా..? ఆ నాడు ఆదిమానవులకు, ఆ తర్వాత కొంత అభివృద్ది చెందిన నియాండర్ థాల్స్ కు మధ్య లైంగిక సంబంధాలే కారణమని అమెరికన్ పత్రిక ఒకటి పేర్కొంది. హ్యూమన్ జెనెటిక్స్ అనే ఈ పత్రికలో పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు. మన జన్యువులే దీన్ని స్పష్టం చేస్తున్నాయని వారన్నారు. 

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం యూరప్‌‌లో నియాండర్ థాల్స్ , డెనిసొవన్స్ కలిసి జీవించేవారట. వారి లైంగిక సంబంధాల కారణంగా ఆ తర్వాత పరిణతి చెందిన మానవ జాతికి జన్యువుల ద్వారా ఎలర్జీలు సంక్రమించాయన్నది ఈ పరిశోధనల సారాంశం. హ్యూమన్ డీఎన్ఏ కు సంబంధించి జర్మనీలోని ఓ సంస్థ వెయ్యి జీనోమ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసే పనిని చేపట్టింది. మన పూర్వీకుల చరిత్రలో జీన్స్ వహించిన ముఖ్యమైన పాత్రను ఈ సంస్థ విశ్లేషించింది. రోగ నిరోధక శక్తి, ఎలర్జీలు తదితరాలపై సమగ్ర పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వివరించింది.

 
 
Related News