AP and TS / Entertainment
బన్నీని అడ్డుకున్న పవన్ ఫ్యాన్స్
73 days ago

ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ ఫంక్షన్‌కు వస్తోన్న సమయంలో పవన్ ఫ్యాన్స్ చుట్టుముట్టి పవర్‌స్టార్... పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ ఎటూ కదలలేని పరిస్థితి తలెత్తింది. దీంతో అలానే చూస్తూ చిరునవ్వులు చిందించాడు బన్నీ. కొద్దిసేపటికి పోలీసుల జోక్యంతో అల్లుఅర్జున్ వేదిక దగ్గరకు వెళ్లిపోయాడు.

అయితే, పవన్ ఫ్యాన్స్ ఎంత చెప్పినా అల్లుఅర్జున్ వేదికమీద పవన్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. గతంలో పవన్ ఫ్యాన్స్ సరైనోడు ఆడియో ఫంక్షన్లో ఇలాగే నినాదాలు చేయడం..అప్పుడు బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ కామెంట్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై 'ఒక మనసు' ఆడియో రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సుధీర్ఘ వివరణకూడా ఇచ్చాడు.

 

 
 
 
Related News

JournalistDiary