India / Entertainment
అమీర్ పేటలో....రివ్యూ
36 days ago

ఇటు సాఫ్ట్ వేర్, అటు ఛారిటీ.. ఈ రెండింటి అరుదైన కాంబినేషన్ తో రిలీజైందే అమీర్ పేటలో చిత్రం.. శుక్రవారం విడుదల అయిన ఈ మూవీలో  హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాడు దర్శకుడు శ్రీ..ఈ ప్రాంతంలో ఎన్నో సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిలూ, అబ్బాయిలూ ఈ సెంటర్లలో శిక్షణ పొందుతుంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు.. వారి లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. స్థూలంగా కథలోకి వెళ్తే..

వివేక్ (శ్రీ) అనే యువకుడు తన ఊరి నుంచి హైదరాబాద్ రాగానే సాఫ్ట్ వేర్ రంగాన్ని ఎంచుకోవాలా లేక సినీ పరిశ్రమే బెటరా అని ఆలోచించి చివరకు సినీ రంగం వైపే మళ్ళు తాడు. ఇతని రూమ్ లో వెంకట్రావు, లింగ బాబు, చిట్టి అనే ముగ్గురు స్నేహితులు సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఒక సందర్భంలో వివేక్ కు ప్రియ (అశ్విని) అనే యువతి పరిచయమవుతుంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించినా ఇద్దరి ఆలోచనా దృక్పథాలు వేరుగా  ఉంటాయి. ప్రేమ అంటే ఓ గౌరవ భావమే అన్నది ప్రియ ఉద్దేశం.

దీంతో ఇద్దరూ స్నేహితులుగానే ఉండిపోదామనుకుంటారు. ఇక వివేక్ రెండేళ్ళు సినీ రంగంలో కష్టపడినా ఆ తరువాత టెక్కీ గా మారి జాబ్  సంపాదిస్తాడు.  ఇదంతా ఫస్టాఫ్ అయితే ఇక అనాథ పిల్లలను  ఆదుకోవడమన్నది సెకండ్ హాఫ్ థీమ్. వారికి సాధ్యమైనంత సాయం చేయాలనుకుంటుంది ప్రియ. ఈ మిషన్ లో ఆమె సక్సెస్ అయిందా..? వివేక్, ప్రియల లవ్ ఎలా మలుపు తిరిగింది.. అతని స్నేహితులు అతనికి సాయపడతారా..లాంటి విశేషాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.

 వివేక్ గా నటించిన శ్రీ తానే కథను నడిపించాడు. మొదటి పార్ట్ అంతా కామెడీగా, సరదాగా  సాగితే. రెండో పార్ట్ కాస్త సీరియస్ గా, అనాథ పిల్లలను ఆదుకోవాలన్న ఎలిమెంటు తో నడిచింది. శ్రీ, అశ్విని తమ పాత్రలకు న్యాయం చేశారు. అమీర్ పేటలో అన్న టైటిల్ సాంగ్, పిల్లలపై తీసిన పాట బాగున్నాయి. అయితే ఎడిటింగ్ లో లోపాలున్నాయి. అక్కడక్కడా కత్తెర వేయాల్సింది. సీన్స్ మధ్య లింక్ లేకపోవడం మైనస్ పాయింట్. నేటి యూత్ ఆలోచనలు, వారి ట్రెండ్ ఎలా ఉంటాయని చూపడానికి శ్రీ ప్రయత్నించాడు. స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా రాణించాడో లేదో  ఆడియెన్స్ నిర్ధారించాల్సి ఉంది. 

 
 
 
Related News

JournalistDiary