AP and TS / Entertainment
యాన్ ఈవెనింగ్ ఇన్ హాయ్‌‌‌లాండ్
133 days ago

ఖైదీ నెం.150 చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఘటనలు మెగాస్టార్ చిరంజీవికి మరచిపోలేని చేదు అనుభవాలను మిగిల్చాయి. రాంగోపాల్ వర్మపై నాగబాబు కామెంట్లు, వర్మ ట్వీట్లు , జనసేన పార్టీ జెండాలు పట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన హంగామా, చివర్లో మళ్ళీ వారు కుర్చీలు విసిరి సాగించిన బీభత్సం ఈ ఈవెంట్ కు పరాకాష్టగానిలిచాయి.

ఒక్క చిరు ప్రసంగాన్ని మినహాయిస్తే ఇవన్నీ చేదు గుళికలే అయ్యాయి. గుంటూరులోని హాయ్ లాండ్ లో ఈ నెల 7 న జరిగిన ఈ తతంగం రెండు రోజుల వినోద కాలక్షేపానికి బాగానే పనికి వచ్చిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ నెల 11 న ఖైదీ చిత్రం విడుదల అయినప్పుడు చిరు ఫ్యాన్స్, పవన్ అభిమానుల మధ్య ఎలాంటి రభసా తలెత్తకూడదనే మెగా ఫ్యామిలీ కోరుకుంటోంది.


 

 
 
 
Related News
JournalistDiary