AP and TS / Politics
కామెడీ చేసి హిట్ కొడుతుందా..?
85 days ago

‘జబర్దస్త్’ యాంకర్ రష్మీ సినిమాల్లో సక్సెస్ కాలేకపోతోంది. ‘తను వచ్చెనంట’, ‘అంతం’ అంటూ ఎన్ని సినిమాలు చేసినా.. ఒక్క ‘గుంటూర్ టాకీస్’ తప్ప మిగతావన్నీ ఫ్లాపే. దాంతో రష్మికి ఈ మధ్య ఫిల్మ్స్‌లో గ్యాప్ వచ్చింది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తోన్న న్యూ మూవీలో రష్మికి ఆఫర్ వచ్చిందట.

హారర్ కామెడీగా తెరకెక్కబోయే ఈ మూవీని ఈటీవి ప్రభాకర్ డైరెక్ట్ చేయనున్నాడట. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో వున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీలో రష్మీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయబోతోందని టాక్. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో హాట్ హాట్‌‌గా కనిపించి సక్సెస్ కాలేకపోయిన రష్మి.. కామెడీ రోల్‌తో అయినా హిట్ కొడుతుందేమో చూడాలి.

 
 
Related News