India / Politics
'25 వేల కోట్లు మింగేశారా ?'
289 days ago

ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్, ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి కూడా అయిన అజిత్ పవార్ 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే ఆరోపించారు. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ బాంబే హైకోర్టులో రెండు పిల్స్ దాఖలు చేశారు. సహకార చక్కర ఫ్యాక్టరీలను అడ్డు పెట్టుకుని వీరిద్దరూ ఈ స్కామ్ లో పాలుపంచుకున్నారని మరో క్రిమినల్ పిల్ కూడా వేశారు. వీటిపై ఈ నెల 6 న విచారణ జరగాలని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. 

మహారాష్ట్రలో సరిగా నడవని షుగర్ కో-ఆపరేటివ్ ఫ్యాక్టరీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ఖాయిలా పడిన అలాంటివాటిని అతి చౌక ధరలకు పవార్ కుటుంబం అమ్మివేస్తోందని, దీంతో ప్రభుత్వానికి పాతికవేల కోట్ల నష్టం వస్తోందని అన్నా హజారే పేర్కొన్నారు. ఈ ఫ్రాడ్ మీద సిట్ తో కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. శరద్ పవార్, అజిత్ పవార్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు.


 

Read Also

 
Related News
JournalistDiary