World / Health
డయాబెటిస్‌కు చెక్..
549 days ago

దేశంలో కోట్లాది మధుమేహరోగులకోసం ఓ కొత్త మందు మార్కెట్ లోకి రానుంది. లక్నో లోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి ఈ మూలికా మందును అభివృద్ది చేసింది. నాలుగు రకాల మెడిసినల్ మొక్కలనుంచి దీన్ని తయారు చేశామని ఈ మండలికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

బీజీఆర్-34 అనే మెడిసిన్ ను కొంతమంది మధుమేహ రోగులమీద పరీక్షించి చూశామని, వారిలో గ్లూకోజ్ స్థాయి అదుపులోకి వచ్చిందని వారు తెలిపారు. పూర్తిగా ఆయుర్వేద చికిత్సా విధానంతో దీన్ని తయారు చేశామని, చెప్పిన వీరు.. సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని నిర్ధారించారు. బహుశా వచ్చే పదిహేను రోజుల్లో ఇది మార్కెట్ లో అందుబాటులోకి రావచ్చునని అన్నారు. టాబ్లెట్ల రూపంలో ఈ మెడిసిన్ ఉంటుందని పేర్కొన్నారు.


 

 
 
 
Related News

JournalistDiary