AP / crime
అక్రమాస్తుల కేసులో అరెస్ట్
245 days ago

ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడన్న ఆరోపణలపై ఏపీ ఎక్సైజు అదనపు కమిషనర్ కె.లక్ష్మణ్ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఈయనకు చెందిన ఆస్తులపై శనివారం ఏకకాలంలో వారు మొత్తం 11 చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగానే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. విజయవాడలో భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం విశాఖకు తరలించారు.

 
 
Related News