AP and TS / Entertainment
‘గంట’ మోగలేదేంటో..?
15 days ago

‘ఖైదీ’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనిపించలేదెందుకో..? ఎప్పుడూ సినీ ఈవెంట్లలో ముందు వరసలో ఉండే గంటా.. ఈ ఈవెంటుకు హాజరు కాకపోవడం విశేషమే మరి! గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా ఉండి మద్దతునిచ్చిన ప్రియమిత్రుడు గంటా శ్రీనివాస రావుకు ఈ ఫంక్షన్ ఇన్విటేషన్ అందలేదా అని చర్చించుకుంటున్నారు.

ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు వచ్చినప్పుడు మరి గంటా గైర్‌హాజర్ కావడానికి రాజకీయ కారణాలేవైనా ఉన్నాయేమో అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. వైజాగ్‌లోని చిరు ఫ్యాన్స్‌తోబాటు ఆర్కే బీచ్‌లోని కొన్ని వర్గాలు కూడా దీని గురించి హాట్ గా చర్చించుకున్నట్టు సమాచారం.

 
 
 
Related News

JournalistDiary