AP and TS / General
సినిమా టికెట్ రేట్లకు రెక్కలు..?
148 days ago

ఏపీ, తెలంగాణాలలోని సినీ థియేటర్స్ లో టికెట్ల రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రేట్లను నిర్ణయించేందుకు ముఖ్య కార్యదర్శులు,  హోం శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఈ రెండు రాష్ట్రాలప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసినపిటిషన్లను న్యాయమూర్తి రాజా ఎళంగో పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశించారు. 2013 ఏప్రిల్ 26 న జారీ అయిన జీవో 100 ను కోర్టు కొట్టివేసింది.

అవిభక్త రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను నిర్ధారిస్తూ ఈ జీవో జారీ చేశారు. ఈ రేట్లు తమకు, ఎగ్జిబిటర్లకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జీవోసబబుగా లేదన్న విషయాన్ని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా వచ్చే మార్చి 30 కల్లా ఈ కమిటీలు తగిన నిబంధనలు రూపొందించాలని న్యాయమూర్తి సూచించారు. సంబంధిత అధికారులకు తెలియజేశాక థియేటర్ యాజమాన్యాలు తమ ప్రతిపాదిత టికెట్ రేట్లను అమలు చేయవచ్చునని కోర్టు స్పష్టం చేసింది.

 

 
 
 
Related News

JournalistDiary