AP and TS / Politics
ఫిదా అయిపోతున్నారు
29 days ago

శేఖర్ కమ్ముల లేటెస్ట్ ఫిల్మ్ ‘ఫిదా’ హీరోయిన్ సాయి పల్లవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఆ మూవీలో భానుమతిగా నటించిన సాయి పల్లవికి ప్రేక్షకులతోపాటు సినీ జనాలు కూడా ఫిదా అయిపోతున్నారు. మళయాళీ అయిన సాయి పల్లవి పక్కా తెలంగాణ అమ్మాయిలా చేసిన పెర్ఫార్మెన్స్ అదరహో అంటున్నారు. తెలుగు నేర్చుకొని తనే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పడంతో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లందరికీ సాయి పల్లవి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.

సాయిపల్లవి తనని పెర్ఫార్మెన్స్‌తో డామినేట్ చేసేసిందని స్వయంగా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడంటే.. అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ ఏ రేంజ్‌లో వున్నాయో తెలుస్తోంది. ఇక న్యాచురల్ స్టార్‌గా పెర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తాడనే పేరున్న నానితో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుండడంతో ‘ఎమ్‌సీఏ’ (MCA) మూవీ మీద క్రేజ్ పెరిగిపోతోంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీతో సాయి పల్లవి టాప్ హీరోయిన్ రేస్‌లో ముందుంటుందనేది ట్రేడ్ పండితుల మాట.

 
 
Related News