AP and TS / Entertainment
ఎగరేసి నరికేస్తా..
168 days ago

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కేవలం పతాకావిష్కరణ కాదు..శాతకర్ణి విజయానికి నాంది అన్నాడు బాలయ్య. ఈ నెల 12 న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా ఆదివారం విశాఖలోని జ్యోతి థియేటర్ లో పతాక ఆవిష్కరణకు హాజరైన బాలకృష్ణ.. తన స్పీచ్ లో భాగంగా ఈ మూవీలోని పలు డైలాగులను చెప్పాడు. 

ఇక్కడ మా ఇంట్లో గదికి గోడలుంటాయి. గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటూ కొట్టుకుంటా.కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతా.. సరిహద్దుల్లో స్మశానం నిర్మిస్తాం.. మీ మొండేలను మా జెండాలా ఎగరేస్తాం అని బాలయ్య ఆవేశంగా డైలాగ్ చెప్పాడు. మిత్రమా 12 న మా శాతకర్ణి చిత్రం విడుదల కాబోతోంది అని ఆయన ముగించాడు. బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. 

 

 
 
 
Related News

JournalistDiary