India / General
అవి వల్గర్ డ్యాన్సులు..అందుకే ..
9 days ago

బార్లలో అమ్మాయిలు చేసే డ్యాన్సు లు ఆర్ట్ (కళాత్మక) నృత్యాలు కావని, అవి అసభ్యకరమైనవని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అవి వల్గర్, డెరోగేటరీ (మహిళలను కించపరిచే నృత్యాలు) అని పేర్కొంది. బార్ యువతుల గౌరవాన్ని కాపాడవలసిన అవసరం ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. బార్లలో డ్యాన్సుల ప్రదర్శనపై ఆంక్షలు విధించాలన్న తమ నిర్ణయం సబబే అని సమర్థించుకుంది. చాలా సందర్భాల్లో బార్ డ్యాన్సులను వ్యభిచార రాకెట్లుగా ఓనర్లు ఉపయోగించుకుంటున్నారు..

ఇలాంటివాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. బార్లలో డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలు శిక్షణ పొందినవారు కారని, వారి నృత్యాల్లో కళాత్మకత లేకపోగా అసభ్యంగా, అశ్లీలంగా ఉంటున్నాయని, అందుకే వీటిని నిషేధిస్తూ చట్టం తెచ్చామని ప్రభుత్వం తమ అఫిడవిట్ లో వివరించింది. ప్రభుత్వ  బార్ యజమానులు సవాలు చేసిన సంగతి తెలిసిందే.

 

 
 
 
Related News

JournalistDiary