AP / Politics
అఖిలప్రియ ధర్నా
70 days ago

వైసీపీ అధినేత జగన్ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలపై మళ్ళీ దుమారం రేగింది. బాబును ఉరి తీసినా తప్పు  లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్ళు ఫైరయ్యారు. మంత్రి భూమా అఖిల ప్రియ అయితే ఏకంగా ధర్నానే చేపట్టారు. ఎన్నికల సంఘానికి జగన్ వ్యాఖ్యలను తీసుకెళ్ళారు.

నంద్యాల ఉప ఎన్నికలో రోజు రోజుకో పరిణామం. ఆ మధ్య..చంద్రబాబును నడి  రోడ్డుపై కాల్చి చంపాలని జగన్  దుయ్యబడితే అది ఎలెక్షన్ కమిషన్ వరకూ వెళ్ళింది. అయితే ఇదంతా పీకే జోక్యంతోనే జరిగిందా అన్న గుసగుసలు వినబడుతున్నాయి. జగన్ తన దూకుడు పెంచడానికి ఆయనే కారణమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ జగన్ పై చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించాలని అఖిల ప్రియ కోరుతున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary