India / Politics
యూపీలో బీజేపీ ఎందుకు గెలవదంటే..
74 days ago

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవదని, ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ఈ పార్టీని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆయన చెప్పారు. ఈ చర్య వల్ల, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు చాలావరకు నష్టపోయారు. పైగా నాలుగు లక్షలమంది ఉపాది కోల్పోయారు అని ఆయన అన్నారు. 

ఇప్పుడు యూపీలో ప్రధాని మోదీ వేవ్ లేదని, కుల మతాల ప్రాతిపదికపైనే ఓటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం బీజేపీని దెబ్బ కొట్టడం ఖాయమని జస్టిస్ కట్జూ అభిప్రాయపడ్డారు. ఈ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నత కులాలపైనే, హిందువుల పైనే  ఆధారపడిందని, అయితే అధికార సమాజ్ వాదీ పార్టీ ఓటు బ్యాంకు ఒబీసీలు, ముస్లిముల అండతో పరిపుష్టంగా ఉందని ఆయన చెప్పారు. ఈ పార్టీకి అఖిలేష్ యాదవ్ ఏకైక నాయకుడు.. అందువల్ల ఈ రాష్ట్రంలో 19 శాతం ఉన్న ముస్లిములు, సుమారు 30 శాతం ఉన్న ఓబీసీలు సమాజ్ వాదీ పార్టీకే ఓటు వేసి తిరిగి దీన్ని అధికారంలోకి తెస్తారని మార్కండేయ కట్జూ జోస్యం చెప్పారు.

 

 

 

 
 
 
Related News

JournalistDiary