World / Crime
మెక్సికోలో మరో బీభత్సం
152 days ago

జర్మనీలో క్రిస్మస్ పండుగకోసం షాపింగ్ కి వెళ్ళిన జనం పైకి ట్రక్కు దూసుకుపోయి 12 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే మెక్సికోలో మరో ఘోరం జరిగింది.

అక్కడి బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన భారీ పేలుడులో 26 మంది మరణించగా..70 మందికి పైగా గాయపడ్డారు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మెక్సికో, టల్ట్ పెక్ ప్రాంతంలోని బాణా సంచా విక్రయ మార్కెట్ కి భారీ సంఖ్యలో జనం వచ్చారు.

అయితే అకస్మాత్తుగా జరిగిన పేలుడు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో దుకాణాలతో బాటు దగ్గరలోని ఇళ్ళు, వాహనాలు, ఆస్తులు దగ్ధ మయ్యాయి. గాయ పడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

 

 
 
 
Related News
JournalistDiary