India / Entertainment
పార్టీ తర్వాత ‘రాణి పద్మావతి’ న్యూలుక్ !
22 days ago

 బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తనకు కాస్త తీరిక దొరకగానే పార్టీలకు హాజరవుతోంది. ముంబైలో బుధవారం ఇలాగే కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి అటెండ్ అయింది. పద్మావతి మూవీలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ మీద నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నా..వాటిని పట్టించుకోకుండా జాలీగా ఈ విందులో పార్టిసిపేట్ చేసింది.

ఇక ఇదే అదనని, మనీష్ మల్హోత్రా..దీపికతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను తన ఇన్స్ టా  గ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరణ్ జోహార్ అయితే దీపికను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈమె తాజా చిత్రం పద్మావతి బ్రహ్మాండంగా హిట్ కావడం ఖాయమన్నాడు. ముసిముసి నవ్వుల దీపికను ఈ సెల్ఫీలో చూడొచ్చు.

 

Read Also

 
Related News
JournalistDiary