India / Entertainment
కంగనా కత్తిసాము చూడాల్సిందే
8 days ago

" మణికర్ణిక ..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ " మూవీకోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెగ కష్టపడుతోంది. జిమ్ లో ట్రైనర్ సాయంతో రెండు కత్తులను తిప్పుతూ ..మాంచి యోధురాలిలా కత్తిసాము చేస్తోంది. జాగర్లమూడి  క్రిష్ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమాలో కంగనా..ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రోల్ పోషించడం విశేషం. హాలీవుడ్ కు చెందిన నిక్ పావెల్ ఈ మూవీకి  స్టంట్ డైరెక్టర్. సోనూ సూద్, అంకిత లోఖండే, వైభవ్ తత్వావాడి  ప్రధాన తారాగణం. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ప్రస్తుతం జైపూర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బహుశా హృతిక్ రోషన్ వివాదం నుంచి కాస్త సేద దీరేందుకు కంగనా  రోజులో చాలాసేపు జిమ్ లోనే గడుపుతోందనే సెటైర్లు వినబడుతున్నాయి.

 

‪#KanganaRanaut practicing sword fight this afternoon for Manikarnika. Battle sequences to be shot in Jodhpur post Diwali. Prep in full swing‬

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

 

Read Also

 
Related News
JournalistDiary