India / General
వార్నీ ! నిజంగానే ?
8 days ago

నోటి నుంచి రక్తం.. తలకు, చేతికి బాండేజీ కట్టు. చూడగానే ఈ చిన్నారిని  ఎవరో తీవ్రంగా కొట్టి హింసించారేమో అని బోలెడంత జాలి పడిపోతే తప్పులో కాలేసినట్టే.. అసలు స్టోరీలోకి వెళ్తే.. ఈ గడుగ్గాయికి ఏమీ కాలేదు. నిక్షేపంగా ఉన్నాడు. ఈ మధ్య ఎక్కడో నిర్వహించిన ఫన్నీ డ్రెస్ కాంపిటీషన్ లో ఇలా వేషం కట్టాడట. తన భార్యతో వాదులాట జరిగిందని, అందుకే ఈ దుస్థితి కలిగిందని రాసి ఉన్న వైట్ బోర్డొకటి తన టీ షర్టుకి తగిలించుకున్నాడు. ఈ కుర్రాడి వైనం సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తుంటే..అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నెటిజన్లు తమాషా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వీడి పేరెంట్స్ " క్రియేటివ్ ఐడియా " కి కితాబిస్తున్నారు కూడా !

 

Read Also

 
Related News
JournalistDiary