సౌర మండలానికి దూరంగా ఉంటాయని భావిస్తున్న తోకచుక్కలు ఇలా కనబడి అలా మాయమైపోతుంటాయి. రాత్రుళ్ళు కేవలం సెకండ్ల కాలంలో కనబడే వీటిపై అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం-నాసా విస్తృత పరిశోధనలు చేస్తోంది. తాజాగా ఓ బ్రహ్మాండమైన తోకచుక్క భూమికి దగ్గరగా వస్తోందని, దీన్ని కంటితో స్పష్టంగా చూడవచ్చునని నాసా శాస్త్రజ్ఞులు ప్రకటించారు.

ఇప్పటికే టెలిస్కోప్ ద్వారా దీని గమనాన్ని వాళ్ళు గమనించారట. బహుశా ఇది వచ్చే వారం (ఈ నెల 16 రాత్రి) భూమికి దగ్గరగా కనబడవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ తోకచుక్కను 46 పి/విర్తనెన్ అని వ్యవహరిస్తున్నారు. ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కామెట్ ఫోటోను నాసా ఇటీవల విడుదల చేసింది.

ఈ నెల 12 న ఇది సూర్యుడికి అభిముఖంగా రావచ్చునని, ఆ తరువాత కొన్ని రోజులకు మన గ్రహం వైపు దూసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. గత నెల 7 న టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు దాదాపు పూర్తి చంద్రుడి సైజులో ఈ తోక చుక్క ఉంది. భూమికి అప్పుడు సుమారు 35 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అంచనా వేశాం అని వీరు వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *