India / General
నా భర్త కనిపించడం లేదు.....
193 days ago

భారత జవాన్లకు ఇస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటోందని అంటూ తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి తన భర్త కనిపించడం లేదని అతని భార్య పేర్కొంది. సోమవారం సాయంత్రం నుంచి తాను తన భర్తతో మాట్లాడలేక పోయానని, అతను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదని ఆమె హిందీలో రాసినట్టు చెబుతున్న వైనం ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ అయింది. అయితే ఇది నిజంగా ఆమె రాసిందేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పోస్ట్ ను ఆ తరువాత తొలగించారు. తేజ్ బహదూర్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో దీనిపై స్పందించిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా ఈ ఆరోపణలను ఖండించిన బీ ఎస్ ఎఫ్ ఉన్నతాధికారులు..బహదూర్ తాగుబోతు అని, నేరగాడని అంటున్నారు.

 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary