India / Crime
మాయావతీ.. బుట్టలో పడ్డావ్ !
233 days ago

బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్రబుల్స్‌లో పడింది. ఢిల్లీలో ఆమె ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్‌పార్టీ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను చూసి ఐటి అధికారులు కొయ్యబారిపోయారు. ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో 100 కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయ్యిందని, ఈ పత్రాల ద్వారా తెలిసింది. గత 45 రోజుల్లో 104.36 కోట్లను పార్టీ ఖాతాలో జమచేశారు.

నవంబర్ 8 - డిసెంబర్ 23 మధ్య మొత్తం 107 కోట్లు డిపాజిట్ అయ్యాయట. దీంతో ఐటి శాఖ నోయిడాలోని కొంతమంది బిల్డర్లకు నోటీసులు జారీ చేసింది. ఐటీతోబాటు ఈడీ కూడా ఈ డిపాజిట్ల వైనంపై దర్యాప్తు మొదలెట్టింది. మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్‌కు, ఈ బిల్డర్లకు మధ్య లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఆనంద్‌కుమార్ పెద్దఎత్తున నల్లధనాన్ని పెట్టుబడి పెట్టాడని  భావిస్తున్నారు.

 
 
Related News