AP / Entertainment
అప్పుడలా అన్నాను.. అయితే ఇప్పుడిలా అంటున్నా..
8 days ago

ఒకప్పుడు జనాభా పెరగవద్దని కోరానని, కానీ ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని కనాలని ప్రోత్సహిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జనాభా తగ్గిపోతే ఏపీ కూడా జపాన్ లా మారిపోతుందని వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉందని, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీదా ఉందని చెప్పారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 

 

Read Also

 
Related News
JournalistDiary