AP and TS / Entertainment
చిరూకి అందుకే కాలింది !
134 days ago

ఖైదీ ఫంక్షన్ లో నాగబాబు రేపిన రచ్చ ఇప్పట్లో చల్లారేది కాదు. ఇద్దరు 'బాధితుల' నుంచి రియాక్షన్స్ వస్తూనే వున్నా. తమ వైపు నుంచి మాత్రం ఫుల్ స్టాప్ పడిపోయిందంటూ మెగాస్టార్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. వర్మ మేటర్ అటుంచితే.. మీతో పాటు జర్నీ చేసి, మీ సక్సెస్ కు కారణం కూడా అయిన యండమూరి మీద నాగబాబు కామెంట్ చేయడం ఎలా ఆనిపించింది.. అంటూ మీడియావాళ్ళు అడిగినప్పుడు చిరంజీవి కూడా కాస్తంత బాలన్స్ తప్పినట్లే అనిపించింది.

అంత వికాసవంతమైన వ్యక్తిత్వం వున్నవాడు.. పరాయి మహిళను, పైగా స్నేహితుడి భార్యను ఎలా సంబోధించాలన్న కామన్ సెన్స్ ఎందుకు మిస్సయ్యారంటూ ఎదురు ప్రశ్నించారు. యండమూరి ఓ గెస్ట్ లెక్చర్ లో .. చెర్రీ మమ్మీ సురేఖ అంటూ 'ఏకవచన' ప్రయోగం చేయడం తనను బాధపెట్టిందందని చిరు ఓపెన్ అయ్యారు. మిగతా విషయాల కంటే మెగాస్టార్ ఇబ్బందిపడింది ఇక్కడేనన్నమాట. 

 

 
 
 
Related News

JournalistDiary