AP and TS / Entertainment
కాజల్‌ని కూల్ చేసిన ఖైదీ
196 days ago

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తన పంచ్ డైలాగులతో జోష్ నింపేసాడు. చిరు చెప్పిన ఆ డైలాగ్స్ అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చాయి. ‘మిమ్మల్ని చూస్తుంటే విజయవాడ కృష్ణా తీరాన వున్నానా.. విశాఖ సాగర తీరాన వున్నానా’ అనిపిస్తోందంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. ‘ఖైదీ’ ప్రొడ్యూసర్ చెర్రీ గురించి చెబుతూ.. ‘చెర్రీకి నటనలో హద్దులే కాదు.. ప్రొడ్యూసర్‌గా పద్దులు కూడా తెలుసు’ అని అన్నాడు.

ఇక కాజల్ ‘ఖైదీ’ మూవీతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాడు చిరు.‌ చెర్రీతో హీరోయిన్‌గా చేసిన కాజల్.. తరువాత తనతో హీరోయిన్‌గా చేయడం.. అలాగే మెగా హీరోలందరితో హీరోయిన్‌గా చేసి కాజల్ రికార్డ్ క్రియేట్ చేసిందన్నాడు. చిరు మాటలకి కాజల్ టోటల్‌గా ఫ్లాట్ అయిపోయింది. కథానాయికగా చేసిన తనని ‘ఖైదీ’ ప్రమోషన్‌లో పట్టించుకోవడంలేదనే ఫీలింగ్‌లో వున్న కాజల్.. చిరు మాటలతో కూల్ అయిందని అనుకుంటున్నారు.

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary