AP and TS / Entertainment
సిక్స్ ప్యాకా..? నేను గనక ఫోకస్ చేస్తే..
219 days ago

ఖైదీ సినిమాలో తన పాత్రకు తగినట్టు మలచుకోవడానికి స్ట్రిక్ట్ డైట్ పాటించానని, ఈ విషయంలో తనకు ట్రైనర్, డైటీషియన్, జిమ్ ట్రైనర్ కూడా చరణేనని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ కు నేను రెడీ..నేను గనుక ఫోకస్ చేస్తే ఓ సంవత్సరంలో సిక్స్ ప్యాక్ సాధించగలను అని ఆయన ఓ ఇంటర్వ్యూలో ధీమాగా చెప్పాడు. ఇక ఖైదీ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వర్మ, యండమూరిలపై నాగబాబు చేసిన కామెంట్లు, దానికి వర్మ ఇచ్చిన ట్వీట్లు వ్యవహారాన్ని చిరు తేలిగ్గా కొట్టిపారేశాడు. 

హర్ట్ అయ్యాడు కాబట్టే నాగబాబు ఆ ఫంక్షన్ లో రియాక్ట్ అయ్యాడని, తాము కూడా అలాంటి మాటలు వింటున్నప్పుడు హర్ట్ అవుతామని, కానీ వాటికి తాను రియాక్ట్ కానని తేల్చి చెప్పాడు. అందరూ ఒకేలా ఉండాలని లేదు. నాగబాబు రియాక్ట్ అయ్యాడంటే అది అతని గుణమని, అతని ఎక్స్ ప్రెషన్ గురించి మాట్లాడుకోవాలి గానీ అతను వాడిన పదాల గురించి కాదని పేర్కొన్నాడు. దీనిపై తర్జనభర్జనలు అనవసరమని చిరు వ్యాఖ్యానించాడు. విమర్శలు చేసే వారిని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా అని అన్నాడు. 

 
 
Related News