AP and TS / General
పేదోడి ఖాతాలో రూ.17 కోట్లు !...
202 days ago

హైదరాబాద్ లో ఇదో విచిత్ర ఉదంతం..ఓ పేదోడి బ్యాంకు ఖాతాలో రూ. 17 కోట్లు డిపాజిట్ అయిన వైనం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ వ్యక్తి ఎవరో ఇంకా తేలలేదు. నగరంలో రోడ్డు పక్కన చిన్న బిజినెస్ చేసుకునే పేదవాడి ఖాతాలో మొదట 3 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఓ జాతీయ బ్యాంకులో సెప్టెంబరు మొదటి వారంలో ఈ సొమ్ము జమ అయిందని. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ పొందాక ఈ నగదును అదే నెలలో దశల వారీగా విత్ డ్రా చేసుకున్నారని ఐటీ అధికారులు తెలిపారు. నవంబరు 8 తరువాత రూ. 14 కోట్ల నగదును (అన్నీ పాత నోట్లే) సేమ్ ఖాతాలో డిపాజిట్ చేసి అ తరువాత ఇతర అకౌంట్లలోకి మళ్ళించారని తెలిసిందన్నారు. ఈ బ్యాంకు అకౌంట్ ఉన్న వ్యక్తిని సోమవారం విచారించినప్పటికీ..అసలైన వ్యక్తి ఎవరో తెలియలేదని, దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు ఐటీ వాళ్ళు.

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary