Telangana / General
నేనున్నానన్న కేసీఆర్-ముస్లిం పిల్లలకు అనాధ శరణాలయం
64 days ago

హైదరాబాద్ నాంపల్లిలో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ముస్లిం అనాథ పిల్లల ఆశ్రమం..ఆనిస్ ఉల్ గుర్బా భవన సముదాయానికి సీఎం కేసీఆర్ ఆదివారం శంకు స్థాపన చేశారు.

నిజాం కాలంలో స్థాపించిన ఈ గుర్బా అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో దీనికి చెందిన 191 గజాల స్థలం పోవడంతో దానికి బదులు ప్రభుత్వం గత ఏడాది నాలుగు వేల గజాల స్థలం కేటాయించింది.

శంకుస్థాపన తర్వాత కేసీఆర్ భవన డిజైన్ పరిశీలించి ఏడాది లోగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీ ఎం మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు ఏ.కె.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

 
 
Related News