Telangana / Politics
గోదావరిని జీవధారగా మారుస్తాం
71 days ago

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణది కాబట్టే ఇన్నాళ్ళూ నిర్లక్ష్యానికి గురయిందని అన్నారు సీఎం కేసీఆర్. ఇకపై రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టునూ నిర్లక్ష్యం చేయబోమని, మన ప్రాజెక్టులను మనమే నిర్మించుకుని, బాగు చేసుకుని మనమే వినియోగించుకుందామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు.

1996 లో ఎస్సారెస్పీ కట్ట మీదికి వచ్చి చూసినప్పుడు పరిస్థితి దీనంగా కనిపించిందని, ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం అప్పుడే బయట పడిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణా బాగు పడాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని ఆనాడే చెప్పానని, ఇన్నేళ్ళ తర్వాత తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి ఎస్సారేస్పీకి పునరుజ్జీవం చేసేందుకు మీ ముందుకు వచ్చానని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి 200 కి.మీ. ప్రవహిస్తోంది. ఈ నదిలో ఏడాదంతా 70 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మించి జీవధారగా మారుస్తాం అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేతల తీరునూ ఆయన దుయ్యబట్టారు.

 

Read Also

 
Related News
JournalistDiary