India / Politics
కాక్ ఫైట్స్ హంగామా షురూ
49 days ago

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఇక కోడి పందాలు, పందెం రాయుళ్ళకు ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కేరాఫ్ అడ్రసులుగా మారనున్నాయి. ఈ ఫెస్టివల్  సందర్భంగా ఆన్ లైన్ లో కోళ్ళ అమ్మకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ కోళ్ళను రెండు కేటగిరీలుగా పేర్కొంటున్నారు అమ్మకందారులు. ఒకటి కేవలం మాంసాహారానికే ఉద్దేశించినదైతే. మరో కేటగిరీ పందెం కోళ్ళు.. ముఖ్యంగా కనుమనాడు పుంజుల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్కోటి కేజీ వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలవరకు ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. 

అలాగే పందెం కోళ్లలో రెండున్నర కేజీల నుంచి మూడున్నర కేజీల బరువుండే కోళ్ళున్నాయి.వీటి ధర రెండు వేల రూపాయలనుంచి యాభై వేల రూపాయల వరకు ఉన్నాయని అంటున్నారు. డేగ, కోడి డేగ, కాకి నెమలి, సేతువ.... ఇలా రకరకాల పేర్లతో వీటిని వ్యవహరిస్తున్నారు. ఖరీదైన బాదం, జీడిపప్పు, గోధుమ గింజలు వంటి ఆహారాన్ని ఇస్తూ ఈ కోళ్ళను మూడు నెలల క్రితం నుంచే బలిష్టంగా పెంచుతున్నారు. 2014 నుంచి ఆన్ లైన్ లో వీటి అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులూ కోళ్ళ పందాలతో ఏపీ, కర్నాటక రాష్ట్రాలు హోరెత్తనున్నాయి.


 

 
 
 
Related News

JournalistDiary