India / Sports
కుంభకోణం జరిగిందా..? అయితే ఏం..?
294 days ago

కామన్వెల్త్ కుంభకోణం పెద్దఎత్తున జరిగిందా.. అయితే ఏం..? అంటున్నాడు కళంకిత మచ్చపడిన సురేష్ కల్మాడీ. ఈయనను తిరిగి భారత ఒలంపిక్ సంఘం జీవితకాల గౌరవ అధ్యక్షునిగా ఈ సంస్థ ఎన్నుకోవడమే ఇందుకు కారణం.. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందని, ఇందుకు కల్మాడీ బాధ్యుడని ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో సుమారు 10 నెలలపాటు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా మచ్చలేని వ్యక్తిగా కల్మాడీని ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ పరిగణించింది. మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయనను ఈ పదవిలో నియమిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.

1996-2011 మధ్య చాలాకాలం కల్మాడీ ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే కల్మాడీతోబాటు వివాదాస్పద నేపథ్యం ఉన్న అభయ్ సింగ్ చౌతాలా కూడా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గౌరవ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. అయితే తీవ్ర అవినీతి ఆరోపణలున్న వీరిని ఈ పదవులకు ఎన్నుకోవడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయెల్ మండిపడ్డారు. ఇది ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదన్నారు. దీనిపై ఐఓఏ నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

 

Read Also

 
Related News
JournalistDiary