India / Crime
ఆ పోలీసులు రేపిస్టులు..
224 days ago

బస్తర్ జిల్లాలో 2015 నవంబరులో 16 మంది గిరిజన మహిళలపై ఛత్తిస్‌గఢ్ పోలీసులు అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడినట్టు తెలిసింది. వార్తా పత్రికల్లో ఈ మేరకు వచ్చిన వార్తలపై తనకు తానుగా స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్చార్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత మహిళలకు మొత్తం 37 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

మరో 20 మంది బాధితుల వాంగ్మూలం కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. రెండేళ్ళ క్రితం నవంబరు నెలలో పెగడపల్లి, చిన్నగెలూర్, పెద్ద గెలూర్, గుండం, బుర్గిచేరు గ్రామాల్లో పోలీసులు ఇలా అమానుషానికి పాల్పడ్డారు. ఈ వార్తలపై జాతీయ మానవహక్కుల సంఘం స్పాట్ ఇన్వెస్టిగేషన్ జరపడం విశేషం.

 
 
Related News